దేశీయ మార్కెట్లో రియల్‌మీ పి4 ఆర్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ 8,000 mAh బ్యాటరీతో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈ బడ్జెట్ ప్రైస్ లో భారీ 8,000 mAh బ్యాటరీ కలిగిన ఫోనుగా వచ్చినా ఈ ఫోన్ లో బడ్జెట్ చిప్ సెట్, FHD కెమెరా, తక్కువ మినిమమ్ ర్యామ్ తో మార్కెట్లోకి కి వచ్చింది. మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. రియల్‌మీ పి4 ఆర్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ధర : రూ. 18,999, రియల్‌మీ పి4 ఆర్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ధర : రూ. 20,999, రియల్‌మీ పి4 ఆర్ (6 జీబీ + 256 జీబీ) వేరియంట్ ధర : రూ. 22,999. ఈ స్మార్ట్ ఫోన్ సిల్వర్ గ్లేర్, లావెండర్ గ్లేర్ మరియు టైటానియం గ్లేర్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. జూన్ 17 నుంచి ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ రియల్‌మీ అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. ఆఫర్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ మరియు వీడియో వ్యూవింగ్ మరింత స్మూత్ గా ఉంటుంది. అయితే, ఈ ప్రైస్ లో FHD+ రిజల్యూషన్ ఆశించవచ్చు. ఈ కొత్త ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Realme UI 7.0 ఆధారిత ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అయ్యింది. అలాగే గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 5300mm² ఎయిర్ ఫ్లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఈ ఫోన్ లో రియల్‌మీ అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా అందించింది. ఇది రోజువారీ ఫోటోగ్రఫీ కోసం మంచి ఫలితాలను అందిస్తుంది. అయితే, ఈ ఫోన్ కేవలం 30FPS FHD వీడియో సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఈ ఫోన్ కలిగిన 8000mAh భారీ బ్యాటరీ. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల వరకు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బైపాస్ ఛార్జ్ మరియు 6.5W రివర్స్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అదనంగా, IP65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్, 5G కనెక్టివిటీ మరియు డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.
0 Comments