ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్య అతనిపై నిఘాపెట్టింది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసిన ఆమె వాహనాన్ని ఆపే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్న కారు బోనెట్‌మీదకు లంఘించింది. ఈ ఘటన భమోరా పరిధిలోని దేవ్‌చరా చౌరహా వద్ద శనివారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఆమె బోనెట్‌పై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోదావరి (38) , నేత్రపాల్ సింగ్ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త వేరే మహిళతో కలిసి కారులో ప్రయాణించడం చూసి, అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆపకుండా, మరింత వేగం పెంచడంతో, బోనెట్‌పై దూకేసింది. ఆమె బోనెట్‌పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా వంద మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తానికి అడ్డుకుని, ఆమెను సురక్షితంగా కిందకు దించారు. కారు ముందుకు దూసుకెళ్తుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళ బోనెట్‌ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి.
భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం : ఆపే ప్రయత్నంలో కారు బోనెట్‌మీదకు లంఘించిన భార్య : సోషల్ మీడియాలో వీడియో వైరల్
Wednesday, June 10, 2026
Husband's Extramarital Affair national Uttar Pradesh's Bareilly district Video goes viral Wife Leaps onto Car Bonnet to Stop Him
No comments:
Post a Comment