సీబీఎస్‌ఈ 12వ తరగతి జవాబు పత్రాల వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ : దరఖాస్తు గడువు ఒక రోజు పొడిగింపు

السبت، 6 يونيو 2026

Application Deadline Extended by One Day Board has officially decided CBSE Class 12 Answer Sheet Verification and Re-evaluation national

t f B! P L


సీబీఎస్‌ఈ 12వ తరగతి జవాబు పత్రాల వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ (పునఃమూల్యాంకనం) కోసం దరఖాస్తు చేసుకునే గడువును మరో రోజు పొడిగిస్తూ బోర్డు అధికారిక నిర్ణయం తీసుకుంది. జూన్ 6వ తేదీతో ముగియాల్సిన ఈ గడువును, జూన్ 7 అర్ధరాత్రి వరకు పొడిగించారు. జూన్ 2న ప్రారంభించిన పోస్ట్-రిజల్ట్ సర్వీసెస్ ఆన్‌లైన్ పోర్టల్‌లో తీవ్రమైన సాంకేతిక సమస్యలు తలెత్తడం, దానివల్ల విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడటంతో బోర్డు ఈ సడలింపు ఇచ్చింది. "విద్యార్థుల ఇబ్బందులను, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 12వ తరగతి బోర్డు పరీక్షల వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని పొడిగించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులకు ఈ ప్రక్రియను ఎలాంటి ఆందోళన లేకుండా పూర్తి చేయడానికి అదనపు సమయం, మద్దతు లభిస్తుంది" అని బోర్డు తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. విద్యార్థులు ఈ సవరించిన షెడ్యూల్‌ను గమనించి తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. తమకు వచ్చిన మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థుల కోసం బోర్డు మంగళవారం ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో విద్యార్థులు తమ స్కాన్ చేసిన జవాబు పత్రాలను స్వయంగా పరిశీలించుకోవచ్చు. ఒకవేళ ఆ జవాబు పత్రాల్లో పేజీలు కానీ, మ్యాప్‌లు/గ్రాఫ్‌లు కానీ మిస్ అయినా, స్కానింగ్ సరిగ్గా లేక అస్పష్టంగా కనిపించినా, లేదా తప్పుడు ప్రశ్నపత్ర సెట్లకు మార్కులు వేసినట్లు గమనించినా.. వాటిని బోర్డు దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకునేందుకు ఈ పోర్టల్ ద్వారా అవకాశం కల్పించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ