'నీట్‌'పై ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది : ఎక్స్‌లో రాహుల్‌ గాంధీ వీడియోను పోస్ట్‌

الأحد، 24 مايو 2026

future of 22 lakh children is unknown Government is trying to avoid responsibility on 'NEET' national NSUI protested Rahul Gandhi posted a video on X

t f B! P L


నీట్ ప్రశ్నపత్రం లీక్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో ఉండగా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆదివారం ఎక్స్‌లో ఈ మేరకు ఎన్‌ఎస్‌యూఐ నిరసన తెలిపిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. "లక్షలాది మంది యువత రోడ్లపై ఉన్నారు. 22 లక్షల పిల్లల భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. అయినా ప్రధాని మౌనంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పడంపై కాదు, బాధ్యత నుంచి తప్పించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, నీట్ లాంటి ప్రశ్నపత్ర లీకులు ఆగేలా పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు మేము ఆగము" అని రాహుల్‌ గాంధీ అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడటంలో ప్రధాని మోడీ ప్రభుత్వం విఫలమైందని, "ప్రశ్నపత్ర లీక్ మాఫియా" పెరగడానికి అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎక్స్‌లో కాంగ్రెస్ ట్వీట్‌ చేస్తూ.. "నీట్ ప్రశ్నపత్ర లీక్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను చీకటిలోకి నెట్టింది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నపత్ర లీక్ మాఫియా విస్తరిస్తోంది. బాధ్యులు మాత్రం మౌనంగా చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వినోద్‌ జాఖర్‌ నాయకత్వంలో కార్యకర్తలు పాదయాత్ర చేపట్టి, యువత వ్యతిరేక మోదీ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌తో చేసే ఈ చెలగాటాన్ని ఏ మాత్రం సహించం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రశ్నపత్ర లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ