దేశంలో గత పది రోజుల్లో మూడు సార్లు ఇంధన ధరలు పెంచారు. చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. దీని వలన సుమారుగా లీటర్‌పై రూ.5 పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు మరికొద్ది రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ హెచ్ఆర్, రాజ్ కుమార్ దుబే, ఏఎన్ఐతో మాట్లాడుతూ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయాలు కొనసాగితే, రిటైల్ ఇంధన ధరలను మరింత పెంచడం అనివార్యం కావచ్చని ఆయన తెలిపారు. ముడి చమురు మార్కెట్లు నిరంతర అస్థిరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, పాలసీ మేకర్స్‌కు ఉన్న ప్రత్యామ్నాయా మార్గాలను గురించి వివరించారు. ప్రస్తుతం పాలసీ మేకర్స్‌కు రెండు లేదా మూడు మార్గాలు ఉన్నాయి. ఇంధన ధరల పెంపు మొదటి మార్గమైతే, పెట్రోలియం కంపెనీలు ఆ నష్టాలను భరించి, మరింత నష్టాలను మిగుల్చుకోవాలి. మూడవది ప్రభుత్వ నిధులు సమకూర్చడం. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా 20 శాతం నుండి 50 శాతం వరకు ఇంధన ధరలు పెరగవచ్చని మొదట్లో తాత్కాలికంగానే భావించినప్పటికీ, మారుతున్న పరిస్థితుల తీరు చూస్తుంటే, ఇది కొనసాగవచ్చని అన్నారు.
إرسال تعليق