అంతర్జాతీయంగా చమురు వ్యాపార సమీకరణాలు వేగంగా మారుతుండటంతో సాంప్రదాయ సరఫరాదారులైన సౌదీ అరేబియా, అమెరికాలను వెనక్కి నెట్టి వెనెజువెలా భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. ప్రస్తుతం రష్యా మొదటి స్థానంలో, యూఏఈ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. గత తొమ్మిది నెలలుగా వెనెజులా నుంచి భారత్‌కు చమురు సరఫరాలు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే, వెనెజువెలా చమురు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను కొంతవరకు సడలించడంతో పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఏప్రిల్ నెలలో రోజుకు సగటున 2.83 లక్షల బ్యారెళ్లుగా ఉన్న సరఫరా, మే నెల నాటికి ఏకంగా 4.17 లక్షల బ్యారెళ్లకు చేరుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్ ‘క్లెపర్’ గణాంకాలు వెల్లడించాయి. వెనెజులా నుంచి లభించే ‘హెవీ క్రూడ్’ (అధిక సల్ఫర్ కలిగిన ముడిచమురు) అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వ్యయ అనుకూలత కారణంగా భారతీయ రిఫైనరీలు, ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు ఈ చమురును భారీగా కొనుగోలు చేస్తున్నాయి. వెనెజులా నుంచి వచ్చే ఈ రకమైన హెవీ క్రూడ్‌నుశుద్ధి చేయడానికి గుజరాత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన అధునాతన రిఫైనరీ అత్యంత అనుకూలమైనది.
భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించిన వెనెజులా
الجمعة، 22 مايو 2026
international national Russia retains the top spot Venezuela Emerges as India's Third-Largest Oil Supplier while the UAE holds the second position
ليست هناك تعليقات:
إرسال تعليق