తెలంగాణ లోని మేడ్చల్ - మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న వంశీమోహన్ నివాసాలు, ఆయన అనుబంధ స్థావరాలపై ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజామున ఒకేసారి దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన బలమైన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు, హైదరాబాద్ పరిసరాల్లోని మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గతంలో శేరిలింగంపల్లి ఆర్డీవోగా పనిచేసిన సమయంలోనే వంశీ మోహన్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించడం, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయించడం, బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు జరిపించడం వంటి వ్యవహారాలపై ఏసీబీ గట్టి నిఘా పెట్టింది.
డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇంట్లో ఏసీబీ సోదాలు : వందల కోట్ల అక్రమాస్తుల గుర్తింపు !
الجمعة، 22 مايو 2026
ACB Raids Deputy Collector Vamsi Mohan's Residence Illegal Assets Worth Hundreds of Crores Unearthed Medchal-Malkajgiri and Ranga Reddy districts Revenue departments telangana
ليست هناك تعليقات:
إرسال تعليق