ప్రైవేటు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న వేధింపులు, బెదిరింపులు, అసత్య ఆరోపణలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఐఎంఏ సభ్యులు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. పెండెం వెంకట రమణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రైవేటు వైద్యులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నప్పటికీ, కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిరాధార ఫిర్యాదులు చేయడం, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయడం, వైద్య సిబ్బందిని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఐఎంఏ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు ఆరోగ్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఫిర్యాదు వ్యవస్థను బాధ్యతాయుతంగా వినియోగించాలని, కావాలని తప్పుడు ఆరోపణలు చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ప్రైవేటు వైద్యుల వేధింపులపై ఐఎంఏ ఆవేదన !
الخميس، 21 مايو 2026
action be taken against those who deliberately level false allegations IMA Expresses Anguish Over Harassment of Private Doctors telangana
ليست هناك تعليقات:
إرسال تعليق