దేశంలో ఎబోలా పరిస్థితిని నిశితంగా గమనిస్తోన్న కేంద్ర ప్రభుత్వం !

الخميس، 21 مايو 2026

Central Government Closely Monitoring Ebola Situation in the Country national special screening procedures are being conducted at international entry points

t f B! P L


భారత ప్రభుత్వం దేశంలో ఎబోలా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దేశంలోకి ఎబోలా రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా విదేశీ ఎంట్రీ పాయింట్స్ వద్ద ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు డీజీహెచ్‌ఎస్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్) అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి.. ముఖ్యంగా ఎబోలా అత్యధికంగా వ్యాపిస్తున్న కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా ఎబోలా లక్షణాలు ఉంటే వెంటనే వారిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, రక్తస్రావం వంటివి ఉంటే ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్లకు చెబుతున్నారు. వారిని ప్రత్యేకంగా ఉంచి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య స్తితిపై పర్యవేక్షిస్తున్నారు. అలాగే, ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరికైనా ఇలాంటి అనారోగ్య లక్షణాలు 21 రోజుల్లోపు వస్తే.. వెంటనే తమకు తెలియజేయాలని కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు ఇటీవలి కాలంలో ఏయే దేశాలు తిరిగారో కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా విదేశాల నుంచి ఇండియాకు ఎబోలా రాకుండా చూస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ