ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పుష్కర ఘాట్ల వద్ద కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులు పవన్ కళ్యాణ్‌కు వివరించారు. ముఖ్యంగా భవిష్యత్ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణించి గోదావరి పరిసరాలను పరిశీలించారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై కూడా సంబంధిత శాఖ అధికారులు వివరాలు అందించారు. గోదావరి నదిలో కాలుష్య నివారణ చర్యలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. ఘాట్ల వెంట పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి నియంత్రణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటకాభివృద్ధికి అనుగుణంగా ప్రణాళికలు అమలు చేయాలని ఆయన అభిప్రాయపడినట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post