మధురై మీనాక్షి ఆలయం సమీపంలో యువకుడి దారుణ హత్య


మిళనాడు, మధురై నగరంలోని మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలో 17 ఏళ్ల యువకుడిని నిన్న అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని కుబేంద్రన్‌గా గుర్తించారు. చిత్తిరై ఉత్సవాల సందర్భంగా కుబేంద్రన్‌తో నిందితులకు వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కారణంగానే ఆయనను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన గ్యాంగ్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు మృతుడి సన్నిహితులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ముత్తుమణి నేతృత్వంలోని గ్యాంగ్ కుబేంద్రన్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో ముత్తుమణి, రాజ్, సతీశ్‌కుమార్, హరికృష్ణన్, ముత్తుకుమార్‌ల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యతో మీనాక్షి అమ్మన్ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం