బసవతారకం ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

الجمعة، 1 مايو 2026

amaravati Andhra Pradesh built at a cost of ₹750 crore Nandamuri Balakrishna Launches Construction Work for Basavatarakam Hospital spanning an area of ​​approximately 21 acres near Thullur

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులు ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. గతంలోనే భూమిపూజ నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో తుళ్లూరు గ్రామానికి సమీపంలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో  750 కోట్ల రూపాయలతో ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. అత్యాధునిక చికిత్సా పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో ఈ సెంటర్ రూపుదిద్దుకోనుంది. రాజధాని ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే, కేవలం ఆంధ్రప్రదేశ్ వారే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మెరుగైన క్యాన్సర్ చికిత్స లభిస్తుంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గాలకు రాయితీ ధరలపై నాణ్యమైన వైద్యం అందిస్తుంది. నిర్ణీత కాలపరిమితిలోగా అంతర్జాతీయ ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ కాంట్రాక్ట్ పొందిన సంస్థ సన్నాహాలు చేసింది. మొదటి దశలో భాగంగా ఆసుపత్రి సేవలు ప్రారంభించి, క్రమంగా రీసెర్చ్ సెంటర్ , అకాడమిక్ విభాగాలను విస్తరించనున్నారు. అమరావతి రాజధాని నగరంలో హెల్త్ సిటీ నిర్మాణానికి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రేరణగా నిలవనుంది. బాలకృష్ణ స్వయంగా పనులను పర్యవేక్షిస్తుండటంతో త్వరలోనే రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ