ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ సుమారు 4000 మంది ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో ఈ కంపెనీ 20 వేల మంది ప్రెషర్లను నిషమించుకునే ప్లాన్ చేస్తోంది. ఈ తొలగింపులు వెనక ఏఐ కారణమని తెలుస్తోంది. ఖర్చుల్ని తగ్గించుకునే ప్లాన్ చేస్తోంది. కంపెనీ ''ప్రాజెక్ట్ లీప్'' ద్వారా ఏఐ, డిజిటల్ సేవల్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 230-320 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగ్నిజెంట్‌లో ప్రస్తుతం 3.57 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఐటీ నిపుణులు చెప్పేదాని ప్రకారం ఐటీ రంగంలో ఇప్పుడు ఏఐ భారీ మార్పులు తీసుకువస్తోంది. మానవ వనరులపై ఆధారపడటం తగ్గి ఏఐ ఆధారిత సేవలపై దృష్టి పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల అవసరం తగ్గుతోంది. గతంలో కూడా కాగ్నిజెంట్ 3000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మరికొందరిని తొలగించే ప్లాన్ చేస్తోంది.
కాగ్నిజెంట్ 4000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ?
الجمعة، 1 مايو 2026
000 Employees? 000 freshers At the same time Cognizant Likely to Lay Off 4 company has set a goal to strengthen its AI and digital services technology the company is planning to recruit 20
ليست هناك تعليقات:
إرسال تعليق