మెడికల్ రిపోర్టులను విశ్లేషించే గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ !

السبت، 9 مايو 2026

Analyzing Medical Reports arogyam Google Fitbit Air health it is exceptionally lightweight science technology Weighing in at a mere 12 grams

t f B! P L


గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ పేరుతో సరికొత్త ఫిట్‌నెస్ ట్రాకర్‌ను పరిచయం చేసింది. దీంతో పాటు ‘గూగుల్ హెల్త్’ యాప్‌ను తయారు చేసింది. అంతేకాదు.. ‘AI హెల్త్ కోచ్’ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆరోగ్య సాధనాలపై గూగుల్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. సాధారణ ఫిట్‌నెస్ బ్యాండ్‌లకు భిన్నంగా ఫిట్‌బిట్ ఎయిర్‌ ఉంటుంది. ఇందులో ఎటువంటి స్క్రీన్, నోటిఫికేషన్లు లేదా గడియారం ఉండవు. ఇది కేవలం 12 గ్రాముల బరువుతో అత్యంత తేలికగా ఉంటుంది. దీని ధర 100 డాలర్లు  కాగా, బాస్కెట్‌బాల్ దిగ్గజం స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్ ధరను 130 డాలర్లుగా నిర్ణయించారు. వినియోగదారుడు పదేపదే స్క్రీన్ వైపు చూడకుండా, నిశ్శబ్దంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆరోగ్య డేటాను సేకరించడం దీని లక్ష్యం. ఇది హృదయ స్పందన రేటు, నిద్ర దశలు, స్లీప్ స్కోర్, గుండె లయలో మార్పులను పర్యవేక్షిస్తుంది. ఒత్తిడి స్థాయిలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే హెచ్ఆర్‌వీ డేటాను సైతం ఇది అందిస్తుంది. నడక, రన్నింగ్, సైక్లింగ్, రోయింగ్ వంటి దాదాపు 140 రకాల వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. సేకరించిన డేటాను గూగుల్ జెమిని ఆధారిత AI విశ్లేషించి, వినియోగదారులకు వ్యక్తిగత ఫిట్‌నెస్ ప్లాన్‌లు, నిద్ర సూచనలను అందిస్తుంది. స్మార్ట్ వేక్ అలారం, సైలెంట్ వైబ్రేషన్ అలారం, రెడీనెస్ స్కోర్, కార్డియో లోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మునుపటి మోడళ్ల కంటే ఇది 15 శాతం ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుందని గూగుల్ పేర్కొంది. మే 19 నుంచి ప్రస్తుతం ఉన్న ఫిట్‌బిట్ యాప్ ఆటోమేటిక్‌గా ‘గూగుల్ హెల్త్’ యాప్‌గా అప్‌డేట్ అవుతుందని కంపెనీ వివరించింది. ఫిట్‌బిట్ వినియోగదారుల పాత డేటా అంతా ఇందులోకి మారుతుంది. ఈ కొత్త యాప్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఇది వేరబుల్స్ డేటాతో పాటు ఆపిల్ హెల్త్, హెల్త్ కనెక్ట్, మెడికల్ రికార్డులను ఒకే చోట పొందుపరుస్తుంది. అలాగే, గూగుల్ హెల్త్ ప్రీమియం సభ్యుల కోసం ‘AI హెల్త్ కోచ్’ అందుబాటులోకి వస్తోంది. ఇది యూజర్ డేటాతో పాటు అప్‌లోడ్ చేసిన మెడికల్ రిపోర్టులు, ఫోటోలను విశ్లేషించి సరైన వర్కవుట్ ప్లాన్‌లు, రికవరీ సలహాలను ఇస్తుంది. ఫిట్‌బిట్ ఎయిర్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. మే 26 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ