తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని క్లినికల్ విభాగంలో ఓ చిరుత ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలానికి దారితీసింది. వర్సిటీ సిబ్బందిపై దాడికి యత్నించి, ఆపై మరుగుదొడ్లో దాక్కున్న చిరుతను అటవీశాఖ అధికారులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి బంధించారు. సోమవారం ఉదయం విశ్వవిద్యాలయంలోని క్లినికల్ విభాగం తాళాలు తీసేందుకు అటెండర్ వెళ్లారు. అన్నివైపులా తలుపులు బిగించి ఉన్న ఆ భవనం ముఖ్య ద్వారం తెరవగానే.. లోపల ఏడాదికి పైగా వయసున్న చిరుతపులి కనిపించడంతో సదరు అటెండర్ భయంతో గట్టిగా కేకలు వేస్తూ పరుగులు తీశారు. అటెండర్ అరుపులు విని తోటి సిబ్బంది అక్కడికి పరుగున రాగా, వారిని చూసిన చిరుత ఒక్కసారిగా వారిపై దాడికి ప్రయత్నించింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై పక్కకు తప్పుకోగా, చిరుత వెంటనే భవనంలోని ఓ మరుగుదొడ్లోకి వెళ్లి దాక్కుంది.
తిరుపతి పశువైద్య వర్సిటీ బాత్‌రూమ్‌లో నక్కిన చిరుత పులి : మూడు గంటల పాటు శ్రమించి బంధించిన అటవీశాఖ అధికారులు
الثلاثاء، 26 مايو 2026
Andhra Pradesh Forest Department Officials Capture It After Three-Hour Struggle Leopard Hides in Bathroom at Tirupati Veterinary University
ليست هناك تعليقات:
إرسال تعليق