చైనాలో అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రులకు ఆ దేశ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. అవినీతి వ్యవహారంలో వీ ఫెంగే, లీ షాంగ్‌లపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. లంచాలు స్వీకరించిన కేసులో ఫెంగే, లంచాలు తీసుకోవడంతోపాటు ఇవ్వజూపిన కేసులో షాంగ్ దోషిగా తేలారు. అయితే ఈ శిక్ష అమలును కోర్టు రెండేళ్లపాటు నిలిపివేసినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఫెంగే.. 2018-23 మధ్యకాలంలో చైనా రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అత్యంత కీలకమైన రాకెట్ ఫోర్స్‌కు అధిపతిగా ఉన్నారు. ఆయన అనంతరం రక్షణశాఖ మంత్రిగా లీ షాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి ఆయన్ను స్వయంగా జిన్‌పింగే ఎంపిక చేశారు. కానీ, ఏడాది తిరగకముందే తొలగించారు. అనంతరం షాంగ్ కొన్ని నెలలపాటు కనిపించకుండా పోయారు. 2024లోనే అధికార కమ్యూనిస్టు పార్టీ నుంచి ఈ ఇద్దరినీ బహిష్కరించారు. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా భారీ అవినీతి నిరోధక ఉద్యమం చేపట్టింది.
ホーム
/
military court
/
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రులకు మరణశిక్ష
الخميس، 7 مايو 2026
Actions have been taken to this extent against Wei Fenge and Li Shang in the corruption case Former Chinese defense ministers sentenced to death international military court
ليست هناك تعليقات:
إرسال تعليق