Ad Code

ఉద్యోగులకు తెల్లారేసరికి పింక్ కార్డ్ మెయిల్ పంపిన మెటా !


రేపటి నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పిన మెటా సంస్థ పలువురు ఉద్యోగులకు ఇ-మెయిల్స్ పంపి వారు ఆ ప్రయత్నాల్లో వుందామనుకున్న తరుణంలో తెల్లారేసరికి పింక్ కార్డ్ మెయిల్ పంపిందట!. కంపెనీ నిబంధనలకు అనుగుణంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామంటూ మెయిల్ చేసినట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా, ఈ ఉద్యోగులను తొలగించినట్లు తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బుధవారం నుంచే ఈ లేఆఫ్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని మేనేజర్ స్థాయి పోస్టులను తొలగించి, చిన్న బృందాలతో "ఏఐ-నేటివ్" నిర్మాణాలను ఏర్పాటు చేయాలని మెటా భావిస్తోంది. ఇప్పటికే ఉన్న 6,000 ఓపెన్ పొజిషన్లను కూడా మూసివేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ తొలగింపులు, బదిలీలతో కలిపి సుమారు 20 శాతం మంది సిబ్బందిపై, అంటే దాదాపు 16,000 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడొచ్చని అంచనా. మెటా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu