దక్షిణ కొరియాలో జననాల సంఖ్య తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో క్రాఫ్టన్ కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు పిల్లలను కంటే బిడ్డకు 64 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చైల్డ్ కేర్ సపోర్ట్ విధానాన్ని ప్రకటించింది. అంతేకాకుండా పిల్లలను కనే ఉద్యోగులకు పెయిడ్ లీవ్స్తో పాటు మరెన్నో ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. ఒక్క బిడ్డను కంటేనే 64 లక్షల రూపాయలు ఇస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. చెప్పినట్లుగానే బిడ్డను కన్న ఫ్యామిలీకి 64 లక్షల రూపాయలు ఇచ్చింది. భూమండలంపై అతి తక్కువ జననాల రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. దక్షిణ కొరియా మొత్తం జనాభా సుమారుగా 0.1 శాతమే పెరిగింది. పిల్లలను పెంచటం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అక్కడ విద్య, వైద్యంతో పాటు ఆస్పత్రి ఖర్చు చాలా ఖరీదు. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాలో పెళ్లి చేసుకున్నా పిల్లలను కనటం లేదు. ఇప్పటికే సౌత్ కొరియా ప్రభుత్వం పిల్లల్ని కనాలంటూ జంటలకు అనేక ప్రోత్సహకాలు ఇస్తుంది. అయినా కొత్త జంటలు పట్టించుకోవటం లేదు. పిల్లలను ఎందుకు కనటం లేదు అనే విషయాన్ని గుర్తించిన పబ్ జీ గేమ్ సృష్టికర్త కంపెనీ క్రాఫ్టన్ ఓ ఐడియా వేసింది. కంపెనీలో పని చేసే వారు ఒక్క బిడ్డను కంటే చాలు 64 లక్షల రూపాయలు ఇస్తాం అని 2025 ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. ఈ సంత్సరం జనవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య 46 మంది శిశువులకు కంపెనీ ఉద్యోగులు జన్మనిచ్చారు. వాళ్లకు 64 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా, రెండు నెలలు జీతంతో కూడిన సెలవులు ప్రకటించింది.
ホーム
/
technology
/
ఒక్క బిడ్డను కనండి - 64 లక్షల రూపాయలు తీసుకోండి : ఉద్యోగులకు క్రాఫ్టన్ కంపెనీబంపర్ ఆఫర్
الاثنين، 18 مايو 2026
announced two months of paid leave Have One Child – Receive ₹64 Lakhs international Krafton Company's Bumper Offer for Employees technology
ليست هناك تعليقات:
إرسال تعليق