రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకూ దాదాపు 2,300 మంది ఉత్తర కొరియా సైనికులు మృతిచెందినట్లు బీబీసీ కథనాలు ప్రచురించింది. గత సంవత్సరం ఉక్రెయిన్ ఆకస్మిక దాడిలో నియంత్రణ కోల్పోయిన కుర్స్క్ ప్రాంతంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యా తమ సహాయం కోరిందని అందుకు సైనిక్ దళాలను పంపించామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తెలిపారు. తాజాగా ఆ సేనలో 2,300 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో సహాయం కోసం రష్యాకు దాదాపు 11 వేల మంది సైనికులను పంపినట్లు సమాచారం. 8-9 విక్టరీ డే సందర్భంగా రష్యా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించగా, ఉక్రెయిన్ మే 5-6 తేదీల్లో తన వంతుగా విరమణ ప్రకటించింది. అయితే, ఒకరి ప్రకటనలను మరొకరు గౌరవించడం లేదని, దాడులు కొనసాగుతున్నాయని ఇరు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రష్యా- ఉక్రెయిన్ రెండు పక్షాలు కలిపి దాదాపు లక్షల సంఖ్యలో సైనికులు మృతి చెందారని కథనాలు పేర్కొన్నాయి.
ホーム
/
international
/
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో 2,300 మంది ఉత్తర కొరియా సైనికులు మృతి : బీబీసీ కథనాలు
الجمعة، 8 مايو 2026
11000 soldiers were sent to assist Russia in this conflict 2300 North Korean Soldiers Killed in Russia-Ukraine War BBC Reports international
ليست هناك تعليقات:
إرسال تعليق