ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
విద్యుత్ తీగలు తగిలి దగ్ధమైన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు
الأحد، 5 أبريل 2026
Andhra Pradesh crime Near Vempalli in the YSR Kadapa district RTC 'Pallevelugu' Bus Gutted After Contact with Power Lines
ليست هناك تعليقات:
إرسال تعليق