తెలంగాణ లోని హనుమకొండ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 26 ఏళ్ల గర్భిణీతో పాటు ఇద్దరు చిన్నారి కూతుళ్లు ప్రాణాలు కోల్పోవడంతో ఇది ప్రమాదమా లేక పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హత్ (26) దంపతులు. వీరికి ఉమేరా (8), ఆయేషా (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అజారుద్దీన్ స్థానికంగా ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులంతా స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లారు. కాసేపటి తర్వాత ఫర్హత్, ఆమె ఇద్దరు కూతుళ్లు పూల్‌లో శవాలై తేలారు. మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదశాత్తు పడి మృతిచెందినట్లు తండ్రి హజారుద్దీన్ చెబుతుండగా, ప్రెగ్నెన్సీ విషయంలో ఇటీవల భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈ కారణంతోనే భార్య, ఇద్దరు పిల్లలను చంపి ప్రమాదంలా చిత్రీకరిస్తున్నాడని ఫర్హాత్ తండ్రి ఎస్ కే అలీ, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.స్విమ్మింగ్ పూల్‌లో సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ స్వాదీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తల్లీ, ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి
الخميس، 2 أبريل 2026
26-year-old pregnant woman and her two young daughters crime Hanumakonda District Suspicious Deaths of a Mother and Her Two Daughters telangana
ليست هناك تعليقات:
إرسال تعليق