కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను వి.డి. సతీశన్‌కు అందజేశారు. రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు, అనేక ఇతర వాగ్దానాలతో కూడిన ఈ మేనిఫెస్టోను యూడీఎఫ్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ అందిస్తున్న పథకాలు, నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం. యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. రూ. 3,000 సంక్షేమ పింఛను, ఊమెన్ చాందీ పేరుతో అన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత బీమా పథకం. వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి ఆరు 'ఇందిరా హామీలు' మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు, 'జాబ్ వాచ్ టవర్ల' ఏర్పాటు, వయనాడ్‌లో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, కోజికోడ్ మరియు తిరువనంతపురం నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు తదితర యూడీఎఫ్ హామీలు ఇచ్చింది.
కేరళ ఎన్నికలు : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల
الخميس، 2 أبريل 2026
free travel for women on KSRTC buses Kerala Elections Telangana CM Revanth Reddy handed over this manifesto to V.D. Satheesan UDF Manifesto Released
ليست هناك تعليقات:
إرسال تعليق