ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ 'కేంద్రం తెచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిరూపితమైంది. ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దు. 543 సీట్ల నుంచే మహిళలకు 33 శాతం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా మాటలను ప్రజలు నమ్మడం లేదు. బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారు. తమ మాటలు నమ్మాలని కేంద్రం పదేపదే చెబుతున్నా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. దేశం మారింది. ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. భారత్ మేల్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం మహిళలను తప్పుదోవ పట్టించకూడదు. వారికి తమ హక్కులను వెంటనే కల్పించాలి. మా వైఖరి అత్యంత స్పష్టం. ఇండియా కూటమి మొత్తం వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రవేశపెట్టిన ఈ బిల్లు, దానిపై జరిగిన మూడు రోజుల చర్చ మా అవగాహన ప్రకారం మహిళా రిజర్వేషన్లకు సంబంధించినవి కాదు. కేవలం నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే సంబంధించింది. ఇదే విషయం ఓటింగ్ ద్వారా మరింత స్పష్టం చేసింది. ఈ విషయంపై మేమందరం మా అభిప్రాయాలను చాలా నిర్ద్వంద్వంగా వ్యక్తం చేశాం' అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ : విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిరూపితమైంది
السبت، 18 أبريل 2026
defeat for the government is inevitable It has been proven that if all opposition parties unite national Priyanka Gandhi This is the first setback for the Central Government
ليست هناك تعليقات:
إرسال تعليق