ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మాజిద్‌ ఖాదేమి మృతి

الاثنين، 6 أبريل 2026

Intelligence Chief Majid Ghademi Killed in Israeli Airstrikes international Iranian media has reported Majid assumed his duties in 2025

t f B! P L


స్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జిసి) ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మాజిద్‌ ఖాదేమిని అమెరికా హత్య చేసినట్లు ఇరాన్‌ మీడియా ప్రకటించింది. ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లో మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మరణించిన తర్వాత, 2025లో మాజిద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్‌ భద్రతా వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన .. దశాబ్దాల పాటు గూఢచర్య, శత్రువుల గూఢచర్యాన్ని భగ్నం చేసే బాధ్యతలు చేపట్టారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు ముందు ఇంటెలిజెన్స్‌ ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్‌ హెడ్‌గానూ ఉన్నారు. ఇరాన్‌ రక్షణ శాఖలో ఉన్నత పదవులను నిర్వహించారు. ఇరాన్‌పై మరోసారి ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. సోమవారం లోగా హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవకపోతే, ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్‌ కేంద్రాలు వంటి పౌరమౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని పేర్కొన్నారు. ఉచ్ఛరించలేని పదాలతో ఉన్న పోస్ట్‌ను ఆదివారం తన సోషల్‌మీడియా ట్రూత్‌లో తెలిపారు. ఇరాన్‌లో మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని బెదిరించారు. "ఇరాన్‌లో మంగళవారం విద్యుత్‌ కేంద్రాల దినోత్సవం, వంతెలన దినోత్సవం.. అన్నీ కలిపి ఒకే రోజు జరగనున్నాయి. ఇటువంటిది మరెక్కడా ఉండదు. ఆ……..జలసంధిని తెరవండి.. రా, …. లేదంటే మీకు నరకమే… చూస్తూ ఉండండి.. అల్లాకి స్తుతులు " అని ట్రూత్‌లో పేర్కొన్నారు. మార్చి 26న ట్రంప్‌ పదిరోజుల డెడెలైన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ బెదిరింపులపై ఐక్యరాజ్యసమితిలో ఇరాన్‌ మిషన్‌ స్పందించింది. "ఇరాన్‌ పౌరుల మనుగడకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ట్రంప్‌ మరోసారి బహిరంగంగా బెదిరిస్తున్నారు" అని పేర్కొంది. "ఇటువంటి తీవ్రమైన యుద్ధ నేరాలను నివారించాల్సిన చట్టపరమైన బాధ్యత అంతర్జాతీయ సమాజానికి, అన్ని దేశాలకు ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలి. రేపటికి ఆలస్యం అవుతుంది" అని తెలిపింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ