ఆంధ్రప్రదేశ్ లో తొమ్మది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షంతో పాటు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళొద్దు. చెట్లకింద నిలబడొద్దని తెలిపింది.

Post a Comment

أحدث أقدم