బెంగళూరులోని జయనగర్ లో ఉన్న కేఎస్ఐసీ మైసూర్ సిల్క్ షోరూమ్ ముందు ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సోనా సెబిన్ అనే యువతి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రకారం మైసూర్ సిల్క్ చీర కొనడానికి ఆమె వేకువజామున 4 గంటలకే షోరూమ్ వద్దకు చేరుకుంది. ఆమె వెళ్లేసరికి అప్పటికే చాలా మంది మహిళలు లైన్లో ఉన్నారు. ఒక మహిళ తానేమో తెల్లవారుజామున 3 గంటలకే వచ్చానని చెబితే, మరో వ్యక్తి ఏకంగా ముందు రోజు రాత్రి 9 గంటల నుంచే క్యూలో నిలబడినట్లు చెప్పడం విశేషం. ఈ షోరూమ్ ఉదయం 10:30 గంటలకు మాత్రమే తెరుస్తారు. లోపలికి ఒకేసారి కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తారు. అంతేకాదు, ఒక్కో కస్టమర్ కేవలం 10 నిమిషాల్లోనే చీరను ఎంపిక చేసుకోవాలి. ఒక టోకెన్ మీద ఒకే చీర ఇస్తారు. మైసూర్ సిల్క్ చీరల ధరలు ₹23,000 నుంచి ప్రారంభమై ₹2.5 లక్షల వరకు ఉంటాయి. ధర ఇంత ఎక్కువగా ఉన్నా, ఆ చీరల నాణ్యత మరియు వాటికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా మహిళలు గంటల తరబడి నిరీక్షించేందుకు సిద్ధపడుతున్నారు. కాఫీ తాగడానికి బయటకు వెళ్లి వచ్చేలోపు క్యూ లిస్టులో మరో 50 పేర్లు చేరడం చూసి ఆ యువతి ఆశ్చర్యపోయింది. యువతి మైసూర్ సిల్క్ చీర కోసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మైసూర్ సిల్క్ చీర క్రేజ్ : వీడియో సోషల్ మీడియాలో వైరల్
الجمعة، 10 أبريل 2026
Bengaluru karnataka KSIC Mysore Silk showroom located in Jayanagar national The Craze for Mysore Silk Sarees Video goes viral on social media
ليست هناك تعليقات:
إرسال تعليق