ప్రపంచ కప్ - 2026 టికెట్ల ధరలను ఫిఫా భారీగా పెంచింది.. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా "ఫ్రంట్ కేటగిరీ" పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారింది. జూన్ 12న అమెరికాలోని ఇంగిల్‌వుడ్‌లో జరిగే యూఎస్ ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ఫ్రంట్ కేటగిరీ ఒక టికెట్ ధర $4,105గా నిర్ణయించింది. గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర $2,735ఉండేది. అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టిన "ఫ్రంట్ కేటగిరీ 2" టిక్కెట్ల ధరలు $1,940 నుంచి $2,330 వరకు ఉన్నాయి. ఈ ధరలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రపంచ కప్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లోని 16 నగరాల్లో జరుగనుంది. కెనడా ఆరంభ మ్యాచ్‌కు కూడా ఫ్రంట్ కేటగిరీ 1 టిక్కెట్ల ధర $3,360గా నిర్ణయించారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లకు కూడా ధరలు తక్కువగా లేవు. ఫిలడెల్ఫియాలో జరిగే మ్యాచ్‌కు టికెట్ ధర $905గా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ గరిష్ట ధర $10,990గా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైగా ఉంటుంది. డిసెంబర్‌లో ఇదే టికెట్ ధర $8,680 (సుమారు రూ.7.2 లక్షలు)గా ఉండేది. అదేవిధంగా, కేటగిరీ 2 టిక్కెట్లు $5,575 నుంచి $7,380 (రూ.4.6 లక్షలు - రూ.6.1 లక్షలు), కేటగిరీ 3 టిక్కెట్లు $4,185 నుంచి $5,785 (రూ.3.5 లక్షలు - రూ.4.8 లక్షలు) వరకు పెరిగాయి.
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ - 2026 : టికెట్లను ధరలు భారీగా పెంచిన ఫిఫా
الجمعة، 10 أبريل 2026
and Canada FIFA Hikes Ticket Prices Significantly Football World Cup 2026 June 11 to July 19 across 16 cities spanning the United States mexico new designation called the Front Category sports
ليست هناك تعليقات:
إرسال تعليق