మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై మోడీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని కాంగ్రెస్ విమర్శించింది. మోడీ సర్కార్ తన పాలనా వైఫల్యాలను, విదేశాంగ విధానంలో తగిలిన ఎదురుదెబ్బలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. 2024 ఎన్నికల నుంచే తాము ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ను అమలు చేయాలని కోరుతున్నామని, కానీ అలా చేయకుండా జాప్యం చేస్తున్న ప్రధాని మోడీ భారత మహిళలకు ‘క్షమాపణ’ చెప్పాలని డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం కేంద్ర హోం శాఖకు లోబడి పనిచేస్తోందని జైరాం రమేశ్ ఆరోపించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో 30 నెలల తర్వాత ప్రధాని తన మనస్సు మార్చుకున్నారు. వాస్తవానికి జనగణన, పునర్విభజనను మనం మర్చిపోవాలని మోడీ కోరుకుంటున్నారు. 2027 నాటికి ఫలితాలు వస్తాయని సెన్సెస్ రిజిస్ట్రార్ స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన ఇలా చేస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ మహిళలు బీజేపీ వైపు మొగ్గుచూపుతారనే ఆశతో ఇదంతా చేస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో మరే ఇతర అంశంపై మాట్లాడడానికి బీజేపీ దగ్గర సరైన మ్యాటర్ లేదు’ అని జైరాం రమేశ్ ఆరోపించారు. పైగా మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై తీసుకున్న యూటర్న్‌కు కూ డా మోడీ క్రెడిట్ తీసుకోవడంపై జైరాం రమేశ్ మండిపడ్డారు.
మోడీ మహిళలకు క్షమాపణలు చెప్పాలి : కాంగ్రెస్ డిమాండ్
الجمعة، 10 أبريل 2026
Congress Demands Modi Must Apologize to Women national U-turn regarding the implementation of the Women's Reservation Act
ليست هناك تعليقات:
إرسال تعليق