యమునా నదిలో అదుపు తప్పి బోల్తా పడిన పడవ : ఆరుగురు భక్తులు దుర్మరణం, మరో 12 మంది గల్లంతు

الجمعة، 10 أبريل 2026

12 Others Missing Boat Capsizes in Yamuna River carrying passengers far beyond its designated capacity national Six Devotees Die ttar Pradesh

t f B! P L


త్తరప్రదేశ్‌లోని యమునా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడింది. బృందావనంలోని యమునా నదిపై ఉన్న పిపా వంతెన సమీపంలో భక్తులతో నిండిన పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో పడవలో సామర్థ్యానికి మించి భక్తులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ఆరుగురు భక్తులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. వారంతా పంజాబ్ నుంచి బృందావనంను సందర్శించేందుకు వచ్చినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే మధుర జిల్లా యంత్రాంగం, స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. యమునా నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. గజ ఈతగాళ్లు నదిలో గాలిస్తూ గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బృందావనంలో జరిగిన ఈ పడవ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణమే తగిన పరిహారం అందజేయాలని అధికారులకు సూచించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ