తెలంగాణ రాష్ట్రంలో మీ సేవ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వహకుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ధరలను పెంచింది. వినియోగ ఛార్జీలు 50 శాతం పెంచింది. పెంచిన ఛార్జీలను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తమకు వచ్చే కమిషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని మీ సేవ నిర్వహకులు ఎప్పటినుంచో కోరుతున్నారు. కరెంట్, ఇంటర్నెట్, సిబ్బంది ఖర్చులు పెరిగిన క్రమంలో పెంచాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ గతంలో రూ.45 నుంచి రూ.55 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.80కి పెరిగింది. ఇక స్థానిక ధృవీకరణ పత్రంకు రూ.80కి పెరిగింది. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌కు గతంలో రూ.40 నుంచి రూ.45 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.62కి చేరుకుంది. గతంలో కనిష్టంగా ఉన్న రూ.35 సర్వీస్ ఛార్జీలను ఇప్పుడు రూ.62కి పెంచారు. ఏ కేటగిరీ సర్టిఫికెట్ ప్రింట్ వంటి వాటికి రూ.62 వసూలు చేయనున్నారు. ఇక ఆర్టీఏ, కరెంట్ బిల్లు చెల్లింపులు, ప్రభుత్వ అప్లికేషన్లపై కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ప్రభుత్వం అందించే సర్వీసెస్‌పై 18 శాతం జీఎస్టీ విధించనుంది. కేటగిరీ-ఏ విభాగంలో రూ.35 నుంచి రూ.62కి, బీ కేటగిరీలో రూ.45 నుంచి రూ.80కి పెంచింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం పౌర సేవలను మరింత సులభతరం చేయటానికి వాట్సప్ మీ సేవ సేవలను ప్రారంభించింది. మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌లోనే మీ సేవ సేవలను పొందవచ్చు. దాదాపు 581 రకాల సేవలను వాట్సప్‌లోనే పొందవచ్చు. ఇందు కోసం 8096958096 నెంబర్‌ను ప్రవేశపెట్టింది. ఆ నెంబర్ ద్వారా 24 గంటల పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన డాక్యుమెంట్స్ పొందే వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా దాదాపు 10కిపైగా శాఖలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. తాజా నిర్ణయంతో మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు చెల్లించే కమీషన్ కూడా గతం కంటే భారీగా పెరిగింది. గతంలో కేటగిరీ-ఏ సేవలు అందించినప్పుడు చెల్లించిన రూ.35 ఫీజుపై రూ.13 కమీషన్‌గా ఇచ్చేవారు. ఇప్పుడు రూ.62కి పెంచడం వల్ల కమీషన్ రూ.40.34కి చేరింది. దీనివల్ల వారికి మరింత ఆదాయం సమకూరనుంది.
తెలంగాణలో మీ సేవ ఛార్జీలు భారీగా పెంపు !
الخميس، 2 أبريل 2026
effect on April 1st Massive Hike in Meeseva Charges in Telangana Meeseva operators have long been requesting the government to increase their commission User charges have been hiked by 50 percent
ليست هناك تعليقات:
إرسال تعليق