హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, కీలకమైన నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సహా ఇతర ప్రపంచ నాయకులు పారిస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పారిస్‌లో ఈ సమావేశం కంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య జరిగిన ఒక అనూహ్య పలకరింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యక్రమం సందర్భంగా మాక్రాన్ అకస్మాత్తుగా మెలోనీని ఆలింగనం చేసుకుని, ఆమె బుగ్గపై ముద్దు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ సమావేశం కోసం పారిస్ చేరుకున్న మెలోనికి ఎదురెళ్లి మాక్రాన్ స్వాగతం పలికారు. ఈ క్రమంలో మెలోనిని హత్తుకుని ఆమె బుగ్గలపై ముద్దుపెట్టడం చేశాడు. దీంతో, మెలోనీ ఒక్కసారిగా షాకయ్యారు. మాక్రాన్ చేసిన పనికి అసౌకర్యంగా ఫీలయ్యారు. అనంతరం, కొంత దూరం వెళ్లాక మళ్లీ ఆమెను ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేయగా.. మెలోనీ మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు దీనిని అసౌకర్యంగా అభివర్ణిస్తూ, అధికారిక వేదికలపై వ్యక్తిగత హద్దులను గౌరవించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరోవైపు, కొందరు ఇది యూరోపియన్ సంస్కృతిలో సాధారణ అభివాదమని, ఇందులో పెద్దగా వివాదం లేదని చెబుతున్నారు. మరోవైపు ఇరాన్‌పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ చర్చలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సమావేశానికి సుమారు 40 దేశాల నాయకులు హాజరు అయ్యారు.
మెలోనీ ముద్దాడిన బుగ్గలపై మాక్రాన్ : షాక్ కు గురైన మెలోనీ : వీడియో సోషల్ మీడియాలో వైరల్
السبت، 18 أبريل 2026
international Macron Kisses Meloni on the Cheek Meloni Left Shocked Video goes viral on social media world leaders gathered in Paris as part of efforts to reopen the Strait of Hormuz
ليست هناك تعليقات:
إرسال تعليق