జమ్మూకశ్మీర్లోని హజరత్‌బల్‌లో ఉగ్ర వాదులకు ఆశ్రయం ఇచ్చిన నలుగురిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిలో ఓ మహిళను కూడా వుంది. నిందితుల నుంచి ఒక గ్రనేడ్, ఏకే-47 తూటాలు, నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హజ్రత్‌బాల్‌కు చెందిన జహూర్ అహ్మద్ మీర్, బషీర్ అహ్మద్ భట్, గులాం మహమ్మద్ భట్, అదే ప్రాంతానికి చెందిన షాజియా మహమ్మద్ అనే మహిళను నిందితులుగా గుర్తించారు. వీళ్లంతా స్థానికంగా ఉగ్రవాదులకు రహస్య స్థావరాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఉగ్రవాదులకు రవాణా, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నారని, భద్రతా దళాల కదలికలపై సమాచారాన్ని అందిస్తున్నట్లు విచారణలో తేలింది. ముందస్తు సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అరెస్టయిన నిందితులు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
ఉగ్ర వాదులకు ఆశ్రయం ఇచ్చిన నలుగురి నలుగురి అరెస్ట్
الخميس، 23 أبريل 2026
AK-47 ammunition and mobile phones from the accused Authorities seized a grenade Cash Four Arrested for Harboring Terrorists Hazratbal Jammu and Kashmir national
ليست هناك تعليقات:
إرسال تعليق