కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు తాము బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు వైసీపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లుపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దీనిని స్వాగతిస్తున్నామని ఆయన ప్రకటించారు. బిల్లుకు మద్దతివ్వాలని బీజేపీ కోరలేదు. చంద్రబాబు కోరారు. అయితే చంద్రబాబు ప్రస్తావన లేకుండానే ఆయన మద్దతు ప్రకటించారు. వాస్తవానికి, జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనతో అటు తమిళనాడు, కేరళతో పాటు తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ, వైసీపీ మాత్రం ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించుకుంది. టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది. దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాలని అనుకుంటోంది. వైసీపీ ఎన్డీఏలో లేదు కానీ.. తమ విధానం ఎన్డీఏకే మద్దతు అన్నట్లుగా ఉంటుంది.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ప్రకటించిన వైసీపీ !
الأربعاء، 15 أبريل 2026
Andhra Pradesh national Sajjala declared his support for the bill without making any reference to Chandrababu YCP Declares Support for Constituencies Delimitation Bill
ليست هناك تعليقات:
إرسال تعليق