అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రభుత్వంలోనే ఒక గూఢచారి ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు యూఎస్ సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహించింది. అయితే ఆ ఆపరేషన్ వివరాలను గూఢచారి లీక్ చేశాడని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సైన్యం నిర్వహించిన ఆపరేషన్ గురించి ట్రంప్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎఫ్-15ఈ విమానం కూలిన తర్వాత ఒక పైలట్‌ను అమెరికా బలగాలు రక్షించాయని చెప్పారు. అయితే రెండో పైలట్ కోసం బలగాలు ఇంకా గాలిస్తున్నాయని ఓ వార్తాసంస్థ రాసిన కథనంతో ఇరాన్ కు ఆ విషయం తెలిసిందని ట్రంప్ అన్నారు. దాంతో ఆపరేషన్ క్లిష్టతరమైందని చెప్పారు. వార్త రాసిన జర్నలిస్టుకు ఆ సమాచారం ఎక్కడినుంచి వచ్చిందో వెల్లడించాలని ఆర్డర్ వేశారు. లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించారు. సమాచారం ఎవరిచ్చారో జర్నలిస్టు చెప్పకపోతే జైలుకి వెళ్లాల్సివస్తుందని బెదిరించారు. అయితే ఆ జర్నలిస్టు పేరుగానీ, ఆ వార్త సంస్థ పేరుగానీ ట్రంప్ బయటపెట్టలేదు. లీక్‌కు కారణమైన వ్యక్తిని కనిపెట్టేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని ట్రంప్ చెప్పారు. అమెరికా దళాలు రెండో పైలట్ కోసం గాలిస్తున్నాయని వార్త ప్రచురితమైన తర్వాతే.. ఇరాన్ అప్రమత్తమైందన్నారు. ఆ పైలట్‌ను పట్టుకున్నవారికి భారీగా బహుమతి అందజేస్తామని ఆ దేశం బహిరంగ ప్రకటన జారీ చేసిందని, దాంతో తమ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలిపారు. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని మానసిక రోగిగా ట్రంప్ అభివర్ణించారు. అతడిని కనిపెట్టితీరాలని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఎఫ్-15ఈ కూలడంతో గల్లంతైన పైలట్‌ను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ వివరాలను ట్రంప్ మీడియాకు వెల్లడించారు.
మా ప్రభుత్వంలోనే గూఢచారి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
الثلاثاء، 7 أبريل 2026
A Spy Within Our Own Administration emphasizing that this is a matter of national security He stated that the individual must be tracked down international US President Donald Trump
ليست هناك تعليقات:
إرسال تعليق