నేటితో కాల్పుల విరమణకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా దేశాల మధ్య చర్చలకు రంగం సిద్ధం అవుతోంది.హార్ముజ్ జలసంధిలో దిగ్భందం కారణంగా ఇరాన్, అమెరికా మధ్య రెండో రౌండ్ చర్చలు ముందుకు వెళ్లటంపై నీలి మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. కాల్పుల విరమణకు అమెరికా తూట్లు పొడుస్తోందంటూ సీరియస్ గా ఇరాన్ ఉన్న వేళ ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ఇరాన్ టాప్ లీడర్ మోజ్తాబా ఖమేనీ తన చర్చల బృందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో. అమెరికాతో హై-స్టేక్స్ చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుంది. యుద్ధానికి ముగింపు పలికే దిశగా సాగుతున్న ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌కు బయలుదేరనున్నారు. ఆయన వెంట స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జారెడ్ కుష్నర్ వంటి హేమాహేమీలు వెళ్తున్నారు.
إرسال تعليق