తేయాకు తోటలో కార్మికులతో ప్రధాని మోడీ సందడి : ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న మోడీ


స్సాంలోని దిబ్రుగఢ్‌లో ఒక తేయాకు తోటలో కార్మికులను ప్రధాని మోడీ ఆశ్చర్యపరిచారు. అక్కడి మహిళలతో ముచ్చటించారు. వారితో కలిసి తేయాకు ఆకులు కోశారు. మహిళా కూలీల కోరిక మేరకు వారితో సెల్ఫీలు తీసుకున్నారు. తేయాకు కార్మికుల కృషిని ప్రధాని ప్రశంసించారు. తేయాకు తోటల ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో మోడీ పంచుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తన అనుభవాన్ని పంచుకుంటూ, ప్రధానమంత్రి తేయాకును అస్సాం ఆత్మగా అభివర్ణించారు. రాష్ట్ర తేయాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. 'ప్రతి తేయాకు తోట కుటుంబం చేసిన కృషికి మేము చాలా గర్వపడుతున్నాము. వారి కఠోర శ్రమ, పట్టుదల అస్సాం గౌరవాన్ని పెంచాయి,' అని ఆయన మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పర్యటన ఫోటోలను పంచుకుంటూ, ప్రధాని మోడీ "తేయాకు కోయడం అనంతరం మహిళలు తమ సంస్కృతి గురించి మాట్లాడారు, ఆపై ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు!" అని పేర్కొన్నారు. తేయాకు కోసిన తర్వాత, అక్కడి మహిళలు వారి సంస్కృతి గురించి వివరించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments