ఫ్లిప్‌కార్ట్‌ లో మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !

السبت، 18 أبريل 2026

Discount Offer on Motorola Edge 50 Smartphone on Flipkart powered by the Qualcomm Snapdragon 7 Gen 1 Accelerated Edition processor technology

t f B! P L


ఫ్లిప్‌కార్ట్‌ మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ఈ ఫోన్‌ను ప్రారంభంలో రూ. 27,999 ధరకు విడుదల చేయగా, ప్రస్తుతం రూ. 6,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో కేవలం రూ. 21,999 ధరకే విక్రయిస్తోంది. నేరుగా వచ్చే తగ్గింపు మాత్రమే కాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడే వారికి అదనంగా మరో రూ. 1,100 వరకు రాయితీ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నెలవారీ సులభ వాయిదాల పద్ధతిని కూడా అందుబాటులో ఉంచింది. నెలకు కేవలం రూ. 1,078 ప్రారంభ ధరతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ ఇచ్చి కొత్తది తీసుకోవాలనుకునే వారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఫోన్ కండీషన్ బట్టి రూ. 15,100 వరకు అదనపు తగ్గింపు పొందే వీలుంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది సూపర్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 యాక్సిలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తున్న ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్‌కు చాలా వేగంగా సహకరిస్తుంది. గేమింగ్ ప్రియులకు కూడా ఇది మంచి అనుభూతిని ఇస్తుంది. ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు సోనీ సెన్సార్‌ను అమర్చారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సదుపాయం కూడా ఉంది. అలాగే 13 ఎంపీ అల్ట్రా వైడ్, 10 ఎంపీ టెలిఫోటో సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ ఫోన్ ఒక మంచి కెమెరా కిట్‌లా కనిపిస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అదనంగా 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటం విశేషం.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ