ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు ఎల్లిసన్ సంపద రూ. 16.10 లక్షల కోట్లు మేర క్షీణించింది. ఒరాకిల్ షేర్లు మార్కెట్‌లో భారీగా పతనమవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 22, 2025 నాటికి ఎల్లిసన్ నికర విలువ 388 బిలియన్ డాలర్లుగా ఉండేది. అప్పట్లో ఆయన ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏప్రిల్ 3, 2026 నాటికి అది 195 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్స్‌లో ఆయన రెండో స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయారు. ఒరాకిల్ సంస్థలో ఎల్లిసన్‌కు దాదాపు 41% వాటా ఉంది. కంపెనీ షేర్ల విలువ తగ్గితే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ కూడా నేరుగా ప్రభావితమవుతుంది. సెప్టెంబర్ 2025లో 345.72 డాలర్ల వద్ద ఉన్న ఒరాకిల్ షేర్ ధర, ఏప్రిల్ 2, 2026 నాటికి 146.38 డాలర్లకి పడిపోయింది. అంటే దాదాపు 58% మేర పతనం నమోదైంది.
0 Comments