దేశీయ మార్కెట్లో వివో వై 05 స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యింది. ఇది 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది. ఇది 1600 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో వచ్చిన ఈ స్క్రీన్ గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అవుట్ డోర్ లో క్లియర్ విజిబిలిటీ కోసం హై-బ్రైట్ నెస్ ఐ-కేర్ మోడ్ కూడా ఇవ్వబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఆరిజిన్ OS 6.0పై నడుస్తుంది. ఇందులో Unisoc T7225 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అందించారు. అలాగే దీనికి 4GB RAMతో పాటు ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా మరో 4GB వర్చువల్ ర్యామ్ ను జోడించుకోవచ్చు. దీంతో మొత్తం 8GB వరకు మెమరీ సామర్థ్యం లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం Vivo Y05లో 8MP రియర్ కెమెరా (f/2.0) LED ఫ్లాష్‌తో ఇవ్వబడింది. సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా (f/2.2) ఉంది. నైట్, పోర్ట్రెయిట్, లైవ్ ఫోటో, టైమ్-లాప్స్, డాక్యుమెంట్ వంటి మల్టిపుల్ షూటింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 6500mAh భారీ బ్యాటరీ. ఒకసారి చార్జ్ చేస్తే 29 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో ఇతర డివైస్ లను కూడా చార్జ్ చేయవచ్చు. ఈ మొబైల్ కు మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఇచ్చారు. కాబట్టి డ్రాప్స్ & ఇంపాక్ట్ లను తట్టుకోగలదు. IP65 రేటింగ్‌తో డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా Wi-Fi, బ్లూటూత్ 5.2, OTG సపోర్ట్‌తో పాటు FM రేడియో, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
Post a Comment