దేశీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M17e 5G ఫోన్‌ను విడుదల చేసింది. దీనిలో 6,000mAh బ్యాటరీ ఉంది, ఇది ఒకే ఛార్జ్‌పై 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000-సిరీస్ చిప్‌సెట్ కూడా ఉంది. 4GB RAM, 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర రూ.11,749 నుండి ప్రారంభమవుతుంది. 6GB RAM, 128GB స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ వేరియంట్ ధర రూ.13,249. ఈ ఫోన్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 16 మిలియన్ కలర్స్ తో కూడిన 6.58-అంగుళాల HD+ PLS LCD స్క్రీన్ ఉంది. ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OneUI 8 పై పనిచేస్తుంది. దీనికి ఆరు OS అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు కూడా లభిస్తాయి. ఈ ఫోన్‌లో 2.4GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌ను అందించే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. ఈ పరికరంలో 6GB వరకు ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజ్ కూడా ఉంది, దీనిని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించుకోవచ్చు. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపర్చర్, ఆటోఫోకస్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ పరికరంలో f/2.4 అపర్చర్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం, ఈ ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అదనంగా, ఈ పరికరంలో 6,000mAh బ్యాటరీని అమర్చారు.
0 Comments