చైనాలోని మకావులో రోడ్డుపై వాకింగ్ చేస్తున్న ఓ వృద్ధురాలిని వెనుక నుంచి వచ్చి ఓ రోబో భయపెట్టింది. దీంతో సదరు వృద్ధురాలు తీవ్రంగా భయపడి ఆస్పత్రి పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ నేరానికి పాల్పడిన రోబోను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన కథనం ప్రకారం చైనాలోని మకావులో 70 ఏళ్ల వృద్ధురాలు గత గురువారం సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె తన ఫోన్ చూసుకుంటూ ఈవినింగ్ వాకింగ్ చేస్తుంది. ఇంతలో యూనిట్రీ G1 మోడల్‌కు చెందిన 4.4 ఆడుగుల ఓ హ్యూమనాయిడ్ రోబో ఆమెను ఫాలో అవడం ప్రారంభించింది. దీంతో భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన ఆమె ఆ రోబో రూపాన్ని చూసి తీవ్ర భయాందోళనలకు గురై కేకలు వేసింది. నా వెంట ఎందుకు పడుతున్నావ్. నీకు పిచ్చిపిచ్చిగా ఉందా? నీ వల్ల భయంతో నా గుండె వేగంగా కొట్టుకుంటుంది' అంటూ కాంటనీస్ భాషలో రోబోను ఎడాపెడా తిట్టిపారేసింది.
0 Comments