హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ కరెన్సీ రూపంలో టోల్ చెల్లించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థికపరమైన అంశాలే కాకుండా, జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రత బాధ్యతలను ఇరాన్ తన పరిధిలోకి తీసుకుంది. అమెరికా-ఇజ్రాయెల్, అలాగే ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించడాన్ని ఇరాన్ పార్లమెంట్ పూర్తిగా నిషేధించింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని బలపరిచే విధంగా ఈ ప్రణాళిక రూపొందించబడినట్లు అధికారులు తెలిపారు.
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు : ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
الثلاثاء، 31 مارس 2026
Collection of Tolls on Ships Transiting the Strait of Hormuz international Iranian Parliament Gives Green Signal pay tolls in Iranian currency
ليست هناك تعليقات:
إرسال تعليق