భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణం లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ముందు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్ సవరించి కనీసం 30% నిధులు విద్యరంగానికి కేటాయింపు చేయాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని ,యూనివర్శీటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్. టీచీంగ్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో అసెంబ్లీ సందర్భంగా ప్రజా పాలన పేరుతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం SFI విద్యార్ధి నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో సుమారు 9500 పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజులు పెండింగ్ ఉన్నాయని, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు ,కెజిబివిలు 70% అద్దె భవనాలలో నడుస్తున్నాయని, యూనివర్శీటీలలో టీచీంగ్, నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ. చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్ధులు ఎస్సీ, ఎస్టీ, తరగతులు పేదలు చదువుకునే బెస్టు అవైలబుల్ స్కీం బకాయిలు కూడా 218 కోట్లు పెండింగ్ ఉన్నాయని వాటిని కూడా.తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ సమస్యలు పరిష్కారం చేయమంటే రేవంత్ రెడ్డి సర్కారు కూడా అహంకారంతో ముందస్తు అరెస్టులు పేరుతో పోలీసు రాజ్యం నడుపుతుందని అన్నారు.వారు నియమించిన విద్యా కమిషన్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఓపెన్ గా బయట పెట్టిందని ఆయా. సమస్యలు పరిష్కారం కావాలంటే కనీసం 18% నిధులు కేటాయించాలని చెప్పిందని కానీ ఈ వినపడని ప్రభుత్వం ఆ సిఫారసులు పెడ చెవిన పెడుతుందని అన్నారు.ప్రజాపాలనలో అరెస్టులు ఉండవని చెప్పిన రేవంత్ రెడ్డి నిజమైన ప్రజాపాలన అయితే నిర్బంధ అరెస్టులు ఎందుకని సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. అసెంబ్లీ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకత్వం చేతులను పోలీసులు తీవ్ర గాయాలు చేశారని పిడి గుద్దులు గుద్దుతూ ,అమ్మాయిలపై కూడా విచక్షణ మరిచి దాడి చేయడాని ఆయన ఖండించారు. ఇప్పటికి అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, నాయకులు అంజి, రంజిత్, రాకేష్, కృప తదితరులు పాల్గొన్నారు.
కళ్లకు గంతలతో విద్యార్థుల వినూత్న నిరసన !
الخميس، 26 مارس 2026
resolve the issues plaguing the public education sector in Telangana SFI Karimnagar District Committee Students Stage Innovative Protest with Blindfolds telangana
ليست هناك تعليقات:
إرسال تعليق