కువైట్ విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడులు : భారతీయ కార్మికుడు మృతి


కువైట్‌లోని విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రధాన ప్లాంట్‌లోని సర్వీస్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ దాడిలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న భారతీయుడు మరణించగా, మరికొంతమంది గాయపడినట్లు సమాచారం. క్షిపణి లేదా డ్రోన్ నేరుగా భవనాన్ని ఢీకొనడంతో కంట్రోల్ రూం తీవ్రంగా దెబ్బతింది. దీనివల్ల కువైట్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమెరికా తన యుద్ధనౌకలను, సైనిక బలగాలను గల్ఫ్ దేశాలలోని స్థావరాల నుంచి ఇరాన్‌పై దాడులకు ఉపయోగిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికాకు సహకరిస్తున్న దేశాల ఆర్థిక మూలాలను, ముఖ్యంగా విద్యుత్,నీటి ప్లాంట్లపై దాడులు చేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. ఈ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య కాకుండా, కువైట్, యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలకు విస్తరిస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 8 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత గురువారం యూఏఈలో జరిగిన క్షిపణి దాడిలో ఒక భారతీయుడు మరణించగా, ఇప్పుడు కువైట్‌లో మరో ప్రాణం పోయింది. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్న నేపథ్యంలో, అక్కడి పరిస్థితులు వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

إرسال تعليق

أحدث أقدم
3