నెతన్యాహు ఎక్కడ? : సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ప్రశ్న

الثلاثاء، 3 مارس 2026

international there has been no post from Netanyahu and in the wake of Iran's statement Trending question on social media Where is Netanyahu?

t f B! P L


సోషల్ మీడియాలో Where is Benjamin Netanyahu? అనే ప్రశ్న ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. గత కొద్ది గంటల పాటు నెతన్యాహు నుంచి ఎటువంటి పోస్ట్ రాకపోవడం, ఇరాన్ ప్రకటన నేపథ్యంలో నెటిజన్లు నెతన్యాహు ఎక్కడంటూ పోస్టులు పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిన్న రాత్రి వరకు నెతన్యాహు ఎటువంటి పోస్టులు పెట్టలేదు. నెతన్యాహు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో సుమారు 19 గంటల క్రితం రక్షణ మంత్రితో జరిపిన భద్రతా చర్చల ఫోటోను షేర్ చేశారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో నెతన్యాహు సురక్షిత ప్రాంతానికి వెళ్లారా? లేక ఇరాన్ దాడుల్లో ఏమైనా జరిగిందా? అని నెటిజన్లు మీమ్స్, పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో ఈ వాదనలకు చెక్ పడింది. శనివారం దాడితో మొదలైన ఈ ఉద్రిక్తత.. తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్ ప్రతీకార చర్యలతో మధ్యప్రాచ్యంలోని మరికొన్ని దేశాలు కూడా ఈ యుద్ధంలోకి లాగబడే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఊపిరి బిగబట్టి నెతన్యాహు ఇచ్చే తదుపరి ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకవైపు ఖమేనీ మరణం ఇరాన్‌ను కుంగదీస్తుంటే, నెతన్యాహు సైలెన్స్ ఇజ్రాయెల్ వ్యూహమా లేక ప్రమాదమా అన్నది తెలియాల్సి ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ