కర్ణాటక లోని మోకా సమీపంలో శివపుర గ్రామ శివారులో కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్‌వేర్ దంపతులు దుర్మరణం పాలైయ్యారు. ఆదోని పట్టణంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన కార్పొరేషన్ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి అమరేష్ సుమతి దంపతుల కుమారుడు అనురాగ్ (31), బళ్లారికి చెందిన ఐశ్యర్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. అనురాగ్ భార్యతో కలసి తల్లిదండ్రులను చూసేందుకు రెండు రోజుల క్రితం ఆదోనికి చేరుకున్నారు. బెంగళూరుకు తిరిగివెళ్తూ బళ్లారిలో ఉన్న ఐశ్యర్య తల్లిదండ్రులను పలకరించి వెళ్లాలనుకున్నారు. ఈ మేరకు ఇద్దరు బుధవారం సాయంత్రం కారులో వెళ్తుండగా కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన అనురాగ్‌ను వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. కాగా మార్గమధ్యలో అనురాగ్ మృతి చెందాడు. బళ్లారిలో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాలను ఆదోనికి తరలించారు.
కారుని ఢీకొన్నకేఎస్ ఆర్టీసీ బస్సు : సాఫ్ట్‌వేర్ దంపతుల దుర్మరణం
الجمعة، 13 مارس 2026
Andhra Pradesh karnataka KSRTC Bus Collides with Car near Moka outskirts of Shivapura village Software Couple Meets Tragic End
ليست هناك تعليقات:
إرسال تعليق