హైదరాబాద్ మార్కెట్లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర నిన్నటి వరకు 320 రూపాయలుగా ఉండగా, నేడు ఒక్కసారిగా 30 రూపాయలు పెరిగి 350 రూపాయలకు చేరింది. నాటుకోడి ధరలు కేజీకి ఏకంగా ఎనిమిది వందల రూపాయల వరకు పలుకుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా కోళ్లు మృత్యువాత పడడంతో సరఫరా తగ్గగా, రంజాన్ సీజన్ కావడంతో కోడి మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో, ఆ డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేక ధరలు పెరిగాయి. ఈ క్రమంలో చాలామంది వినియోగదారులు చికెన్ కు ప్రత్యామ్నాయంగా చేపలను కొనుగోలు చేసుకుని తింటున్నారు. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పైన పెరిగిన చికెన్ ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక 2026 లో తెలంగాణ రాష్ట్రంలో మాంసం వినియోగం 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.30 లక్షల టన్నులు ఉండగా, 2024- 25 నాటికి అది అద్భుతంగా 11.01 లక్షల టన్నులకు చేరుతుందని వెల్లడించింది.
హైదరాబాద్ మార్కెట్లో పెరిగిన కోడి మాంసం ధరలు
السبت، 21 مارس 2026
business Chicken Prices Rise in Hyderabad Market many consumers are opting to purchase fish reaching ₹350 telangana
ليست هناك تعليقات:
إرسال تعليق