పాకిస్తాన్ లోని కీలక సైనిక స్థావరాలపై తమ వైమానిక దళం దాడులు నిర్వహించిందని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ వెల్లడించింది. భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు రావల్పిండి లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైంది. ప్రస్తుతం పాకిస్తాన్ దాన్ని రిపేర్ చేసుకుంటోంది. ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ కూడా ఆ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ కీలక సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్తాన్ వెల్లడించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తోపాటు క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పలు కీలకమైన పాక్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. తమ దేశంలోని వివిధ ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించిందని ఆందోళన వ్యక్తంచేసింది. పాకిస్తాన్ సైనిక చొరబాట్లకు ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్తాన్ రక్షణ శాఖ ప్రకటించింది. తాము చేసిన దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు పలు సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని తెలిపింది.
పాకిస్తాన్ కీలక సైనిక స్థావరాలపై వైమానిక దళం దాడులు చేశాం : ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ వెల్లడి
الاثنين، 2 مارس 2026
Afghan Defense Ministry reveals Air Force strikes key Pakistani military bases international Nur Khan air base in Rawalpindi
ليست هناك تعليقات:
إرسال تعليق