కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్‌ను మోనాలిసా భోస్లే ప్రేమ వ్యవహారం కారణంగా ఆశ్రయించింది. సమాచారం మేరకు కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో గత ఏడాదిన్నరగా మోనాలిసా ప్రేమలో ఉన్నారు. ఫేస్‌బుక్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడి. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఇద్దరూ డేటింగ్‌లో చేస్తున్నారట. తరచూ కలుస్తున్నారట!. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని మహేశ్వర్ గ్రామానికి చెందిన మోనాలిసా భోస్లే ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులు తిరస్కరించారు. కుటుంబ సభ్యులు ఆమె ప్రేమను ఒప్పుకోకపోవడంతో ప్రియుడి కోసం కేరళ వచ్చి, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ కలిసి తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించారు. మోనాలిసాది ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ వ్యవహారంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇరు కుటుంబాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మోనాలిసా భోస్లే ప్రేమ వ్యవహారం : తిరువనంతపురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన జంట
الأربعاء، 11 مارس 2026
Couple approaches Thiruvananthapuram police station kerala madyapradesh met through Facebook Monalisa Bhosle's love affair national past year and a half
ليست هناك تعليقات:
إرسال تعليق