భక్తులను విచక్షణారహితంగా కొట్టిన పూజారులు : సోషల్ మీడియాలో వీడియో వైరల్‌

الاثنين، 23 مارس 2026

Jyotiba Temple in Kolhapur maharashtra national Priests Indiscriminately Beat Devotees Video goes viral on social media

t f B! P L


మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని జ్యోతిబా ఆలయంలో సుమారు 15 నుంచి 20 మంది పూజారులు కొందరు భక్తులను చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితులను పిడిగుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడమే కాకుండా కొబ్బరికాయలతోనూ పూజారులు దాడి చేయడం ఈ వీడియోలో కనిపించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ప్రధాన హారతి సమయంలో కొందరు యువకులు ఆలయంలో గందరగోళం సృష్టించారు. పూజారులపై గులాల్ (రంగు) చల్లి, వారి టోపీలను కింద పడేశారు. వారిని వారించే క్రమంలో సహనం కోల్పోయిన పూజారులు ఆ యువకులను గుడి బయటకు లాక్కొచ్చి మరీ చితకబాదారు. కొందరు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. ఈ ఘటనపై ఆలయ కమిటీ స్పందిస్తూ పూజారులకు మద్దతుగా నిలిచింది. పక్క ఊరి నుంచి మద్యం మత్తులో వచ్చిన సుమారు 100-200 మంది ఆకతాయిలు.. హారతిని అడ్డుకోవడమే కాకుండా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, వృద్ధ పూజారులను సైతం అవమానించారని ఆరోపించింది. పూజారులను అప్రతిష్టపాలు చేసేందుకే వీడియోను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ